TS News: ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌, డిసెంబరు 3, 4 తేదీల్లో

Published : 27 Nov 2021 11:28 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌, డిసెంబరు 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ, ఫార్మ్‌ డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. డిసెంబరు 13న స్లాట్‌ బుకింగ్‌, 14న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. డిసెంబరు 13 నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్లకు వీలు కల్పించారు. డిసెంబరు 17న తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. డిసెంబరు 19న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని