logo
Updated : 27/11/2021 14:39 IST

TS News: ఇందిరాపార్క్‌ వద్ద ‘వరి దీక్ష’ ప్రారంభం 

హైదరాబాద్‌: తెలంగాణలో పండిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కర్షకులకు అండగా కాంగ్రెస్‌’ అనే నినాదంతో కిసాన్ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వరి దీక్ష చేపట్టారు. నగరంలోని ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు జరిగే దీక్షలో భాగంగా శనివారం రాత్రి ముఖ్యనేతలు దీక్షాస్థలిలోనే ఉండనున్నారు. వరిధాన్యంపై వివిధ దిన పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగులను దీక్షా ప్రాంగణంలో ప్రదర్శనగా ఉంచారు. 


Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని