logo
Published : 28/11/2021 03:52 IST

124 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్‌

వికారాబాద్‌లో ఈవీఎం స్టోరేజీ స్ట్రాంగ్‌ (గోడౌన్‌) రూంను శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: జిల్లాలో 124 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటల సాగు, కొవిడ్‌ టీకాల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఈసారి సుమారు 2,50,000 టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో 24 గంటల పాటు గట్టి నిఘూను ఏర్పాటు చేశామని తెలిపారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు పాలానాధికారి మోతీలాల్‌, జిల్లా అదనపు పోలీసు అధికారి రషీద్‌, డీఆర్‌డీఓ కృష్ణన్‌, పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌, డీఎం విమల, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని