తోడుగా వచ్చిన వారికి.. నీడనిచ్చారు!
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల బంధువులను ఆదుకుంటున్నామంటూ జీహెచ్ఎంసీ శనివారం ప్రకటించింది. నగరంలోని ఏడు దవాఖానాల్లో పేద, మధ్య తరగతి రోగుల బంధువుల వసతికి భవనాలు నిర్మించామని, వాటి ద్వారా ఉచితంగా ఆశ్రయం పొందుతున్నారని కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ వెల్లడించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు గదులతో, మరుగుదొడ్లతో కూడిన భవనాల్లో రోజూ 500 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
ఏడు ఆస్పత్రుల్లో: నాలుగేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం రూ.10.68 కోట్ల వ్యయంతో ఏడు ఆస్పత్రుల్లో నిర్మాణాలు ప్రారంభించింది. ప్రస్తుతం అన్ని భవనాలు అందుబాటులోకి వచ్చాయి. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో నిర్మించిన భవనంలో 108 మంది ఒకేసారి ఆశ్రయం పొందవచ్ఛు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని భవనంలో 126 మంది, మహావీర్ ఆస్పత్రిలోని నిర్మాణంలో 76 మంది, నిలోఫర్ ఆస్పత్రిలోని భవనంలో 192 మంది, కోఠి ప్రసూతి వైద్యశాలలోని వసతి భవనంలో 160 మంది, పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో 115 మంది, నాంపల్లి ప్రాంతీయ వైద్యశాలలో 100 మంది చొప్పున సేద తీరొచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.