logo
Updated : 28/11/2021 06:07 IST

ముచ్చటైన సింగారం.. మురిసింది నేస్తం

పెంపుడు జంతువులకు ఫ్యాషన్‌ దుస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: మెడలో టై.. ముచ్చటైన కోటు.. తలపై అందమైన టోపీ.. దర్జాగా నడక. ఆ వయ్యారాలు చూసి ఎవరైనా వావ్‌ అనాల్సిందే. మగవాటినే అలా ముస్తాబు చేస్తే.. ఆడవాటికేం తక్కువంటూ పట్టు గౌను.. ఆకట్టుకునే అలంకరణ.. సంప్రదాయం ఉట్టిపడేలా మరింతగా అందంగా సింగారిస్తున్నారు. ఇదీ.. నగరంలో పెంపుడు జంతువుల పట్ల యజమానులు కురిపిస్తున్న సృజనాత్మక అభిమానం. మనసుకు దగ్గరై.. ఒత్తిడిని మాయం చేసే ఆత్మీయ నేస్తాలను కూడా బిడ్డలతో సమానంగా చూసుకుంటూ వాటిని అందంగా ముస్తాబు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు జంతు ప్రేమికులు. ఇందుకు బోలెడంత సొమ్ములు వెచ్చిస్తున్నారు. మారుతున్న అభిరుచులకు తగినట్టు మార్కెట్‌లోనూ సరికొత్త డిజైన్లు వస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఎంతోమంది ఒంటరితనం నుంచి బయటపడేందుకు శునకాలు, పిల్లులు, పక్షులు, కుందేళ్లు వంటి వాటిని పెంచుకుంటున్నారు. వాటి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెంపుడు జంతువుల దుస్తులు


సొగసు చూడతరమా!

పెంపుడు జంతువుల్లో శునకాలు.. పిల్లులదే అగ్రభాగం. అపురూపంగా చూసుకునే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం.. గోళ్లు, జుట్టు కత్తిరించటం సాధారణం. మరింత అందంగా.. ఆకట్టుకునేలా కనిపించేందుకు వీటికి ఫ్యాషన్‌ దుస్తులు వేస్తున్నారు. పండుగలు, పార్టీలు, పోటీలు ఇలా సందర్భానికి తగ్గట్టు వినూత్న డిజైన్లతో అలంకరిస్తున్నారు. కాళ్లకు పట్టీలు.. మెడలో గొలుసులుతోపాటు ఆడ/మగ జంతువులకు తగినట్టుగా డిజైనర్లు వస్త్రాలు రూపొందిస్తున్నట్లు డాగ్‌ ఓ బౌ సంస్థ డైరెక్టర్‌ ఇబాబత్‌ శర్మ తెలిపారు. యజమానులు తాము కొత్త వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతిసారీ పెంపుడు జంతువు కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించమని కోరుతున్నట్లు చెప్పారు. శేర్వాణీ, శేర్వాణీ ర్యాప్‌, రెయిన్‌కోట్‌, టక్సిడో, టక్సిడో ర్యాప్‌, టోపీలు, నెక్‌టుటు, వెయిస్ట్‌ టుటు, ఓవర్‌ హెడ్‌ రెయిన్‌కోట్‌, కాలర్స్‌ వంటివి మగవాటి కోసం రూపొందిస్తున్నారు. ఎంబ్రాయిడరీ, గాజు అద్దాలతో గౌన్లు, పట్టు పరికిణీలు, టోపీలు, టీల్‌ పోల్కా డాట్‌ ప్రాక్‌, కాలర్‌ స్క్రాప్‌ వంటివి ఆడ కుక్కలు, పిల్లుల కోసం డిజైన్‌ చేస్తున్నారు. కాళ్లు, మెడ, వీపు భాగాల్లో అలంకరణ కోసం రింగులు.. పట్టీలు.. వంటి వాటితో ముస్తాబు చేస్తున్నారు. వీటి పడక కోసం పరుపులు, దిండ్లు కూడా హోదాకు అనుగుణంగానే కొంటున్నారు.


అందాల పోటీలకూ సై

శునకాలు యజమాని పట్ల విశ్వాసంతో మెలగటం.. ఆపదలో ఉన్నపుడు అప్రమత్తమవటం. ఇది నిన్నటి మాట.. అందాల పోటీలకు సిద్ధమై పతకాలు తీసుకురావడం ఇదీ ఇప్పటి ఆలోచన. విందులు.. వినోదాలు కార్యక్రమమేదైనా యజమానులు తమతో సమానంగా ముస్తాబు చేసి పెంపుడు జంతువులనూ వెంట తీసుకెళ్తూ ప్రేమ చాటుకుంటున్నారు. జంతుప్రేమికుల అభిరుచులకు తగినట్టుగా ఫ్యాషన్‌ డిజైనర్లు వస్త్రాలు రూపొందించేందుకు ముందుకొస్తున్నారు. రూ.1500-5000 వరకూ దుస్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దుకాణదారులు పండుగలు, ఉత్సవాల సమయాల్లో రాయితీలు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో జరిగే శునక ప్రదర్శనల్లో తాజాగా శునకాలు, పిల్లులకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అందంగా ముస్తాబై.. సొగసుగా నడిచి విజేతలుగా నిలిచిన వాటిని అందాల కిరీటంతో సత్కరిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని