logo
Updated : 28 Nov 2021 09:13 IST

TS News: రోడ్డుపై దొరికిన రూ.6.3లక్షలు పోలీసులకు అప్పగింత

కార్మికుడి నిజాయతీని అభినందించిన సీపీ రవీంద్ర


బాధితుడికి నగదు బ్యాగ్‌ అప్పగిస్తున్న కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

కాటేదాన్‌: రణవీర్‌ సింగ్‌(41) కాటేదాన్‌లోని పోషక్‌ఫుడ్‌ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం యజమానికి చెందిన మరో పరిశ్రమలో ఇవ్వడానికి రూ.6.3లక్షల నగదుతో ఉన్న బ్యాగును బండిపై పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో సంచి పడిపోయినా గుర్తించకుండా వెళ్లిపోయాడు. కాలినడకన వస్తున్న పాలిమర్‌ కంపెనీలో పనిచేసే కార్మికుడు అశోక్‌ తివారి(29)కి ఆ బ్యాగ్‌ కనిపించింది. తెరచి చూడగా నగదు ఉంది. ఆ సంచిని తన యజమాని రణబీర్‌కు అప్పగించాడు. రణబీర్‌ వెంటనే అశోక్‌ను వెంటబెట్టుకుని నేరుగా మైలార్‌దేవుపల్లి ఠాణాకు వచ్చాడు. అదే సమయంలో నగదు పోగొట్టుకున్న రణవీర్‌ ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఠాణా పరిశీలనకు వచ్చారు. బ్యాగును పోగొట్టుకున్న రణవీర్‌కు నగదు అందించిన రణబీర్‌, అశోక్‌లను కమిషనర్‌ అభినందించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని