logo
Published : 28/11/2021 05:47 IST

చిత్ర వార్తలు

ధాన్య దీక్ష

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ధర్నాచౌక్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన వరిదీక్షకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రోజంతా దీక్షలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు నేతలు రాత్రి వేదిక వద్దే నిద్రించారు.


పెకిలించినా.. చిగురించేలా..

అటవీ ప్రాంతంలో నాటుతూ..

కర్ణాటకలోని హసన్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్న గ్యాస్‌ కోసం హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ ఏర్పాటు చేస్తోంది.  శంషాబాద్‌ పెద్ద గోల్కోండ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 51 కి.మీ. మేర వేయాల్సి ఉంది. పైపులైనుకు అడ్డుగా ఉన్న చెట్లను వేర్లతో తవ్వి, సమీప అటవీ ప్రాంతంలో నాటుతున్నారు. హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు, ట్రీ ప్రొటెక్షన్‌ కమిటీతో కలిసి ఏడాది కాలంలో పదివేల చెట్లను నాటగా, 98 శాతం బతికాయని ప్రతినిధులు తెలిపారు.


పెరుగుతున్న చెట్లు


బస్సులు తక్కువాయె.. ఇబ్బందులెక్కువాయె!

ఖైరతాబాద్‌ నుంచి లిబర్టీ కూడలి మీదుగా అంబర్‌పేట ఛే నంబరు మార్గంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో  విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదమని తెలిసినా.. ఫుట్‌ బోర్డుపై ప్రయాణించాల్సి వస్తోంది.


వీరిని ఎవరడుగుతారు..?

రోడ్ల మరమ్మతుల్లో గుత్తేదారు ఇష్టారాజ్యం.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ చిత్రం. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ నుంచి జడ్‌టీఎస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వరకు నాలుగు రోజుల క్రితం తారు రోడ్డు వేశారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఎప్పటినుంచో రెండు వాహనాలు పార్కింగ్‌ చేసి ఉన్నాయి. వాటిని తరలించాలని గుత్తేదారు అడగలేదు.. అధికారులు పట్టించుకోలేదు. ఇంకేముంది.. వాహనాల వరకు వదిలేసి.. మిగతా పని పూర్తి చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని