logo
Updated : 29/11/2021 02:04 IST

చిత్రవార్తలు

వరుసకట్టి.. జూపార్కుచుట్టి

జంతువుల సందర్శన, కార్తిక వన భోజనాలకు నగరవాసులు ఆదివారం జూపార్కు బాటపట్టారు. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. చిన్నాపెద్దా కలిసి జంతువులను తిలకించి సందడిగా కలియదిరిగారు.


వారాంతం.. హుషారు అనంతం

ట్యాంక్‌బండ్‌ వద్ద..

ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఫన్‌డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఇటీవలె స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 పురస్కారాలు దక్కడంతోపాటు చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌కు త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కిన నేపథ్యంలో ఈ వారం స్వచ్ఛ స్ఫూర్తిని చాటే థీమ్‌తో హెచ్‌ఎండీఏ ఫన్‌డే వేడుకల్ని నిర్వహించింది. సాయంత్రం 5గంటలకు కళా, సాంస్కృతిక ప్రదర్శనలతో మొదలైన కార్యక్రమం అర్ధరాత్రి 12గంటల దాకా ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.  మరోవైపు ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమంతో చారిత్రక కట్టడం వద్ద సందడి నెలకొంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో చార్మినార్‌ పరిసరాలు కిక్కిరిశాయి.

చార్మినార్‌ పరిసరాల్లో..

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


మారని వక్రబుద్ధి.. అత్యాశే మూసీ శుద్ధి

నగరవాసులకు ఇబ్బందికరంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. మురుగునీటిని శుద్ధిచేసి నదిలో కలుపుతోంది. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ సెప్టిక్‌ ట్యాంకుల నిర్వాహకులు పట్టపగలు వ్యర్థాలను నాగోల్‌ మెట్రోస్టేషన్‌ డిపో వద్ద మూసీకి చేరే నాలాలో కలిపేశారు.


యుక్తితో మెలిగె.. షెడ్డు వెలిగె

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పక్కన మాస్కులు, బెల్టులు, బొమ్మలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించే దిల్లీకి చెందిన చిరువ్యాపారి అనిల్‌ యుక్తితో వ్యవహరించారు. రూ.6 వేలు వెచ్చించి సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. పైసా ఖర్చు లేకుండా విద్యుత్తు అవసరాలు తీర్చుకుంటున్నాడు.


మహాత్మా జ్యోతిరావు ఫులె వర్ధంతిని అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాలో ఆయన విగ్రహం వద్ద పలువురు నేతలు నిర్వహించారు. 1. విగ్రహానికి పూలమాల వేస్తున్న రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు  2. నివాళులర్పిస్తున్న భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు   గీతామూర్తి, భాజపా హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, పార్టీ సీనియర్‌ నేత వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు  3. కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు, యువజన కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మోత రోహిత్‌ తదితరులు

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని