logo
Published : 29/11/2021 00:35 IST

చేపల వేటకు వెళ్లి కూలీ మృతి

దాసు

తూప్రాన్‌, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి కూలీ మృతి చెందిన సంఘటన తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌ గ్రామానికి చెందిన మాటూరి దాసు(35) ఒంటరిగా జీవిస్తున్నాడు. కుటుంబ కలహాలతో దాసు దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఒక్కడే కూలీ నాలీ చేసుకుంటున్నాడు. శనివారం రాత్రి గ్రామశివారులోని ఓ చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. గట్టుపై దాసు చెప్పులు, దుస్తులు ఉండటంతో గ్రామస్థులు వెతకగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆటో బోల్తాపడి చోదకుడు..

అక్బర్‌

జహీరాబాద్‌ అర్బన్‌: ప్రమాదవశాత్తు అదపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో చోదకుడు మృతిచెందినట్లు జహీరాబాద్‌ గ్రామీణ ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపారు. శేఖాపూర్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌(23) ఆదివారం ఆటో నడుపుకొంటూ జహీరాబాద్‌ వస్తుండగా ఫత్రునాయక్‌తండా సమీపంలో బోల్తాపడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి యూసూఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని