logo
Updated : 29/11/2021 03:54 IST

శ్రీసాయి ఐటీ సొల్యూషన్స్‌కు రూ.లక్ష జరిమానా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ రూపొందిస్తామని ఒప్పందం చేసుకొని కాలయాపన చేసిన శ్రీసాయి ఐటీ సొల్యూషన్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్‌ రూ.లక్ష జరిమానా విధించింది. న్యూసంతోష్‌నగర్‌ కాలనీకి చెందిన డి.నవీన్‌ నిశ్చల్‌ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం రైతుమండి వెబ్‌సైట్‌ రూపకల్పనకు కూకట్‌పల్లిలోని ప్రతివాద సంస్థను ఆశ్రయించారు. రూ.1,26,900 చెల్లింపునకు 2019 మే 21న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రూ.లక్షను ఫిర్యాది విడతలవారీగా చెల్లించారు. నిర్దేశిత గడువు ముగిసినా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ రూపొందించకుండా ప్రతివాద సంస్థ కాలయాపన చేసింది. పలుమార్లు సంప్రదించినా లాభం లేకపోవడంతో, సేవల్లో లోపం కలిగించినందుకు పరిహారం ఇప్పించాలని ఫిర్యాది జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ బెంచ్‌-3 ఫిర్యాది చెల్లించిన డబ్బుకి 9 శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు పరిహారంగా రూ.లక్ష, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ప్రతివాద సంస్థను ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని