logo
Published : 29/11/2021 01:43 IST

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్సై మజీద్‌ కథనం ప్రకారం.. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ కాలనీలో ఉండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రోజువారి కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. చదువు విషయంలో తల్లిదండ్రులు శనివారం రెండో కుమార్తె(18)ను మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం మౌలాలి సీ క్యాబిన్‌ రైల్వేస్టేషన్‌కు దగ్గరలో గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. లోకోపైలెట్‌ రైల్వే అధికారుల ద్వారా జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అప్పటికే అక్కడున్న కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా ఆమెను గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని