చిత్రం కదిలించింది.. తారు పడింది!
రోడ్డుపై ఉన్న కారును తరలిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది
మల్కాజిగిరి, న్యూస్‌టుడే: మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ నుంచి జడ్‌టీఎస్ ట్రైనింగ్ సెంటర్ వరకు 4 రోజుల కిందట రోడ్డు వేశారు. ఆ సమయంలో రోడ్డు అంచుల్లో నిలిపిన వాహనాలు తొలగించకుండా, వాటి కింద రోడ్డుపై తారు వేయకుండా వదిలేశారు. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఆదివారం ‘ఈనాడు’లో ‘వీరిని ఎవరడుగుతారు?’ శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఆ మార్గంలో నిలిపిన రెండు వాహనాలను తొలగించి, తారు వేయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.