logo
Published : 30/11/2021 03:21 IST

ఒమిక్రాన్‌.. అంతా ఏమార్చున్‌!

ఈనాడు, హైదరాబాద్‌

* ఆమె ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు.. రెండోదశలో కరోనా సోకింది. తొలుత లక్షణాలు కన్పించినా ఏం కాదనే ధీమాతో స్పందించలేదు. వారం తర్వాత ఇన్ఫెక్షన్‌ పెరిగింది. స్థానికంగా ఓ వైద్యుని కలిసి ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకున్నా పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోగా ఆసుపత్రిలో చేర్పిస్తే సీటీ స్కాన్‌లో ఊపిరితిత్తులు పాడైనట్లు తేలింది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా మందగించడంతో ఎక్మో యంత్రం సాయంతో 40 రోజుల చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కాయి. ఖర్చు రూ.70 లక్షలు. కొంత బీమా కింద వచ్చినా భారీ మొత్తంలోనే చేతి నుంచి చెల్లించాల్సి వచ్చింది.

ఇలా రెండోదశలో చాలామంది కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మహమ్మారి బారిన పడ్డారు. కొందరు మరణించగా మరికొందరు ప్రాణాలతో బయట పడినా ఇళ్లు, ఒళ్లు గుల్లయ్యే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల బిల్లులకు ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. కొందరికి బీమా ఉన్నా ఇతర ఛార్జీలకూ బాగానే వెచ్చించారు. ఈ తరుణంలో మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. డెల్టా, డెల్టాప్లస్‌ కంటే ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ ఉంటుందనే అంచనాల దృష్ట్యా ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా సోకిన ఒకరికి ఖర్చు
* ఇంట్లోఐసోలేషన్‌లో ఉంటే: రూ.5-10 వేలు

* ఒక మోస్తరు ఆసుపత్రిలో ఐసోలేషన్‌ (వారానికి): రూ.30-50 వేలు

* ఆసుపత్రిలో సాధారణ వార్డులో చికిత్స (వారానికి).. రూ.70 వేల-లక్షన్నర

* ఐసీయూలో (ఒక రోజుకు)-రూ.40-50వేలు

* ఐసీయూలో ఆక్సిజన్‌ అందిస్తే (రోజుకు)- రూ.60-70 వేలు

* ఎక్మో యంత్రం అవసరమైతే (రోజుకు)- రూ.లక్ష


తస్మాత్‌ జాగ్రత్త...
- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ, సీనియర్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్టు, మెడికవర్‌

మిక్రాన్‌ వైరస్‌ జన్యుపరమైన విశ్లేషణలను చేసినప్పుడు స్పైక్‌ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు వచ్చాయని గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థను సైతం ఏమార్చగల శక్తిని దీనికి ఉండటంతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. టీకాలు వేయించుకోవడం, భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని