logo
Published : 30 Nov 2021 03:21 IST

కారులో మృతదేహం కలకలం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన తిరుమలగిరి ఠాణా పరిధిలో సంచలనం సృష్టించింది. తిరుమలగిరి పెద్ద కమేళ ఆర్టీసీ కాలనీ ప్రధాన రహదారిలో మిలిటరీకి సంబంధించిన ఖాళీ స్థలంలో పార్కు చేసిన కారులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తి మృతిచెందాడని, అతడు అల్వాల్‌కు చెందిన విజయ్‌ భాస్కర్‌రెడ్డి(50) అని గుర్తించారు. మృతుడి ముక్కు, నోట్లోంచి రక్త స్రావం జరగడంతో పాటు చెవి వెనుక భాగంలో చిన్న గాయం ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి పరిశీలించగా, క్లూస్‌ టీం పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్‌రెడ్డి, అతని బంధువుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడం అనుమానాలకు తావిస్తోంది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని