ఎనిమిదో దశహరితహారానికి ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్: హరితహారం 8వ దశలో భాగంగా 1.20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్ఎంసీ ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. నగరవ్యాప్తంగా ఉన్న 600 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేసింది. మొక్కలను పెద్ద సంచుల్లోకి మార్చి.. రాబోయే వర్షాకాలం నాటికి మూడు అడుగులకుపైగా ఎత్తు పెంచుతామని చెబుతోంది. ఏపుగా పెరిగే చెట్లను రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, పార్కులు, శ్మశానవాటికలు, చెరువు గట్లపై నాటిస్తామంటోంది. ఇళ్లలో పెంచుకునేందుకు అనుకూలంగా ఉండే సుమారు 20 జాతుల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటికే 1.17 కోట్ల మొక్కలు నాటామని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.