logo
Published : 30 Nov 2021 03:21 IST

ఎలా ఉండేవి..ఇలా మారాయి!

మరుగున పడిన కట్టడాలకు కొత్త మెరుగులు

బ్యాచ్‌లర్‌ క్వార్టర్స్‌ ముందు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మట్టిలో కూరుకుపోయిన ఒక్కో మెట్ల బావిని తవ్వుతుంటే ఒక్కో అద్భుతం కనిపిస్తోంది.. నాటి దర్వాజాల బూజు దులుపుతుంటే గత వైభవం మైమరిపిస్తోంది.. కాలగర్భంలో కలిసిపోతున్న గడియారం స్తంభాలకు మెరుగులద్దితే అప్పటి నిర్మాణ నైపుణ్యాలు బయటపడుతున్నాయి. ఇలా ఎన్నో పురాతన కట్టడాలు ఈ నాలుగు వందల ఏళ్ల నగరంలో ఉన్నాయి. నగరీకరణతో కొత్త నిర్మాణాలతో మరుగున పడిన వీటి వైభవానికి మెరుగులద్దుతున్నాయి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు. నెటిజన్లు ట్వీట్‌ చేయగానే స్పందిస్తున్న అధికారులు ప్రత్యేక ప్రణాళికతో వీటికి కొత్త రూపునిస్తున్నారు.

బ్యాచ్‌లర్‌ క్వార్టర్స్‌ తర్వాత

బావులు.. గడియారాలు.. దర్వాజాలు: నిజాం ఏలుబడిలో నిర్మించిన మెట్లబావులు ఆయాప్రాంతాల దాహార్తిని తీర్చేవి. గచ్చిబౌలి, రేతిబౌలి, పిరాన్‌బౌలి.. ఇలా ఎన్నో ప్రాంతాలకు వాటి నుంచే పేరొచ్చింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధతో ఈ రెండేళ్లలో దాదాపు 40 మెట్లబావుల్ని గుర్తించి.. చూడ చక్కగా తీర్చిదిద్దారు. నిజాం కాలంలో నగరం చుట్టూరా పదుల సంఖ్యలో దర్వాజాలు నిర్మించారు. చార్మినార్‌ చుట్టూ ఉండే చార్‌ కమాన్‌కి ప్రత్యేక విశిష్టత ఉంది. వీటి చుట్టూ ఏర్పడ్డ ఆక్రమణలు తొలగించి రంగులద్దుతున్నారు అధికారులు. దీంతోపాటు సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌, శాలిబండ క్లాక్‌ టవర్‌లకు మెరుగులద్దారు. మొజంజాహి మార్కెట్‌ సమీపంలో 1940లో నగరంలో నిర్మించిన తొలి కాంక్రీటు కట్టడం బ్యాచ్‌లర్‌ క్వార్టర్స్‌కు రూ.కోటి ఖర్చుతో కొత్త రూపునిచ్చారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని