logo
Published : 30/11/2021 03:21 IST

చదివేది డిగ్రీలు.. చేసేది చోరీలు


జుబేరుద్దీన్‌, సర్ఫరాజ్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఇద్దరూ డిగ్రీ చేస్తూనే, చోరీలకు అలవాటు పడ్డారు. ఒకరు జైలుకి వెళ్లొచ్చినా బుద్ధి మార్చుకోలేదు. మరొకరు ఇతనికి తోడుగా వెళ్లి దొంగతనం చేయడంతో ఇద్దరూ కటకటాలపాలయ్యారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గోల్కొండ పరిధి టోలీచౌకికి చెందిన మహమూద్‌ జుబేరుద్దీన్‌(23) బంజారాహిల్స్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను గతంలో గోల్కొండ, మైలార్‌దేవుపల్లి ఠాణాల పరిధిలో చరవాణులు చోరీల కేసులో నాలుగుసార్లు జైలుకి వెళ్లొచ్చాడు. అయినా బుద్ధి మార్చుకోలేదు. మద్యం తాగి తిరుగుతూ దొంగతనాలు చేయసాగాడు. తోడుగా టోలీచౌకి ప్రాంత వాసి, బంజారాహిల్స్‌లోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతున్న మహమూద్‌ సర్ఫరాజ్‌(22)ను తీసుకెళ్తున్నాడు. ఈనెల 29న కూకట్‌పల్లి రైతుబజారు వద్ద బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేపీహెచ్‌బీలో బుల్లెట్‌, బైకు అపహరించినట్లు ఒప్పుకొన్నారు. వారి నుంచి ఆ రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని