Ts News: రైతులను మోసగించే ప్రయత్నంలో కేంద్రం: మంత్రి జగదీశ్‌ రెడ్డి

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్ర రైతులను మోసగించే ప్రయత్నం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం చేసిందేమీ

Published : 30 Nov 2021 15:29 IST

హైదరాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్ర రైతులను మోసగించే ప్రయత్నం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు మాట్లాడాలి కాని.. ఎంపీలు కాదని పేర్కొన్నారు. దిల్లీకి వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలతో ఎవరికి ప్రయోజనమో కేంద్రం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ పెట్టండి. మా సభ్యులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ నుంచి వడ్లు ఎన్ని కొంటారో స్పష్టంగా చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అవేమీ చెప్పకుండా అడ్డదిడ్డంగా ఏవేవో మాట్లాడుతున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఏం చేయాలనుకుంటున్నారు.. ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రధాని మోదీయే చెప్పాలి. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ భాష గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది’’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని