logo
Published : 01/12/2021 03:34 IST

డిపోలు మూయం.. ఆస్తులూ అమ్మం

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌

రక్తదానం చేసిన సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సాయన్న

పక్కచిత్రంలో రక్తదానం చేస్తున్న వీసీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌, కంటోన్మెంట్‌, బేగంబజార్‌, న్యూస్‌టుడే: బస్సు డిపోలను ఏ ఒక్కదాన్ని మూసి వేయడంలేదని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. ఆస్తులను సైతం అమ్మడం లేదన్నారు. రెడ్‌క్రాస్‌ సంస్థతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం జూబ్లీ బస్సు స్టేషన్లో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్నతో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం ఉద్యోగుల సర్దుబాటు జరుగుతోందన్నారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతం మీడియాతో మాట్లాడి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతకుముందు బాజిరెడ్డి గోవర్ధన్‌ ఈడీ కార్యాలయంతోపాటు కంటోన్మెంట్‌ డిపోను సందర్శించి ఎలక్ట్రికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌, ఎలక్ట్రిక్‌ బస్సులను పరిశీలించారు. జేబీఎస్‌లోని ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. వివిధ స్టాళ్లు సందర్శించి తినుబండారాల ధరలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న బస్సుల్లోకి ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. ఓ బస్సు అద్దం పగిలి ఉండడం, మరో బస్సు మెట్లు సరిగా లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ యుగంధర్‌, అధికారులు జగన్‌, కవిత, జానకిరాములు, జోత్స్నతోపాటు పికెట్‌, కంటోన్మెంట్‌ డిపోల మేనేజర్లు సురేశ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.  ఎంజీబీఎస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 200 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రక్తదానంపై ఎలాంటి సందేహాలు పడాల్సిన పని లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మణ్‌ చెప్పారు.  మంగళవారం ఎంజీబీఎస్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ శర్మన్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి ఎండీ సజ్జనార్‌ రక్తదానం చేశారు.  ఇప్పటికే 80 సార్లు రక్తదానం చేసిన ఓ ఆర్టీసీ ఉద్యోగిని సజ్జనార్‌ అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ మునిశేఖర్‌, యాదగిరి, రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌, ఎంఆర్సీ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,  ఎంజీబీఎస్‌ సహాయ మేనేజర్‌ ఓ.సుధ, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు భీంరెడ్డి, మధుబాబు పాల్గొన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని