logo
Published : 01/12/2021 07:13 IST

దొరికామని బాధపడరు.. చోరీలను ఆపరు!

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మాదాపూర్‌ జోన్‌ సీసీఎస్‌, మియాపూర్‌, ఆర్సీపురం పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వివరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో డీసీపీలు రోహిణి ప్రియదర్శిని, సందీప్‌, వెంకటేశ్వర్లుతో కలిసి కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర విలేకరులకు వెల్లడించారు.

18 ఏళ్లు.. 59 కేసులు..
కర్ణాటక బీదర్‌ ఛిద్రికాలనీకి చెందిన ఆటో డ్రైవరు మొహ్‌సిన్‌ అలియాస్‌ అషు(42) బోరబండ ఎస్‌ఆర్‌టీ కాలనీలో అద్దెకుంటున్నాడు. 2003లో చోరీల బాటపట్టాడు. రాత్రి పూట షేరింగ్‌ ఆటో, బైకుపై చోరీలకు బయలుదేరుతాడు.సినీ తరహాలో ఫుల్‌హ్యాండ్స్‌ జాకెట్‌, చేతికి తొడుగులు(గ్లోవ్స్‌), ముఖానికి ముసుగు ధరిస్తాడు. ఇనుప రాడ్డు, స్క్రూడ్రైవరుతో ఇళ్ల తాళాలు పగలగొట్టి నగలు, నగదు తస్కరిస్తాడు. స్వస్థలానికి చేరుకుని సొత్తును అనుచరుడు షేక్‌ మహ్మూద్‌కు అప్పగిస్తే బీదర్‌లోని వివిధ దుకాణాల్లో విక్రయిస్తాడు. నిందితుడు 2003 నుంచి 2015 వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 39 చోరీలు చేశాడు. 2015లో నగర పోలీసులు పీడీచట్టం నమోదు చేశారు. 2017 నుంచి మళ్లీ మొదలుపెట్టి 20కి చోరీలు చేశాడు. మియాపూర్‌ పరిధిలో 4చోరీలతో పోలీసులు అప్రమత్తమై ఓ పెట్రోల్‌ బంకు వద్ద సీసీఫుటేజ్‌లో అతడిని గుర్తించి సోమవారం పట్టుకున్నారు. 73 తులాల బంగారు నగలు, 4కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

స్కూటర్‌పై చిన్నారితో..
జహీరాబాద్‌ రామ్‌నగర్‌వాసి కేలావత్‌ శంకర్‌చౌహాన్‌(40) వ్యవసాయం, స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటాడు. 2018నుంచి చోరీలు మొదలుపెట్టి ఏడాదిలోనే 11 చేశాడు. 2020లో చందానగర్‌ పోలీసులు అరెస్టు చేసి పీడీ చట్టాన్ని సంధించారు. జైలు నుంచి విడుదలై మళ్లీ చోరీలకు తెరతీశాడు. గతంలో రాత్రివేళ బైకుపై చోరీలకు వెళ్లే ఇతడు పంథా మార్చి యాక్టివా స్కూటర్‌పై వెళ్తున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆరేళ్ల కుమారుడిని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. ఇటీవల ఆర్సీపురం ఠాణా పరిధిలో 1, నార్సింగి పరిధిలో రెండు ఇళ్లను గుల్ల చేశాడు. చోరీ సొత్తును ఇతడి స్నేహితుడు రంగు కృష్ణ చారి బీదర్‌లో అమ్ముతాడు. 12 తులాల బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఛేదనలో కీలకంగా నిలిచిన సిబ్బందికి కమిషనర్‌ పురస్కారాలు అందజేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని