logo
Published : 01/12/2021 03:54 IST

కారు అదుపుతప్పి.. విభాగినిని ఢీకొని..

ఒకరి దుర్మరణం.. ముగ్గురికి గాయాలు

ఘటనాస్థలిలో కారు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: వేగంగా వెళ్తున్న కారుకు కుక్క అడ్డు రావడంతో అది కాస్తా అదుపు తప్పి విభాగినిని ఢీకొన్న ఘటనలో చోదకుడు చనిపోగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడిన ఘటన రాజీవ్‌ రహదారిపై గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ శివారులో చోటుచేసుకుంది. స్థానిక సీఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మేడ్చల్‌-రంగారెడ్డి జిల్లా పోతరాజ్‌పల్లికి చెందిన వెంకటేశ్‌ ముగ్గురు మిత్రులు వంశీకృష్ణ, మహేందర్‌రెడ్డి, వంశీలను తన కారులో సిద్దిపేటకు వెళ్లిరమ్మని ఇదే జిల్లా గౌడవెళ్లికి చెందిన డ్రైవర్‌ సందపురం శివకుమార్‌ (20)ను సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పురమాయించాడు. వారంతా కలిసి సిద్దిపేటకు వెళ్లి మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించే క్రమంలో కారు విభాగినిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోదకుడు శివకుమార్‌ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ఉన్న ముగ్గురు గాయపడగా వారిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.

 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని