logo
Updated : 02/12/2021 06:39 IST

చిత్ర వార్తలు

ప్రేక్షకులకు మరుపురాని మధుర గీతాలు మిగిల్చి, దివికేగిన సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌లో కొద్దిసేపు ఉంచారు. సినీ తారలు, అభిమానులు భారీగా తరలివచ్చి తుది నివాళులర్పించారు.


సమానంగా ఎదగనిద్దాం.. స్వేచ్ఛగా ఎగరనిద్దాం

బాలికలను కాపాడాలి.. స్వేచ్ఛగా ఎదగనివ్వాలంటూ బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ వైదేహినగర్‌లో ఏర్పాటు చేసిన శిల్పం ఆకట్టుకుంటోంది.


చదువుకు బడికి.. ఇబ్బందికి ఇంటికి

ఈ విద్యార్థులు పరుగు పందెంలో పోటీ పడుతున్నారనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. కంటోన్మెంట్‌లోని ఈస్ట్‌మారేడ్‌పల్లి వాల్మీకినగర్‌ సామాజిక భవనంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇంటర్వెల్‌కు ఇళ్లకు వెళుతున్నారు. ఈలోగా బడిగంట మోగిస్తుండడంతో ఉరుకున తిరిగి వస్తున్నారు. కాలకృత్యాలకు పరుగు నిత్యకృత్యంగా మారిందని, ఇబ్బంది తప్పించాలని కోరుతున్నారు.


సందర్శకుల అవస్థలు సందర్శకుల అవస్థలు

జూపార్కు ముందు రోడ్డు దాటాలం నరకమే. ఇక్కడకు నిత్యం వేలాదిగా సందర్శకులు వస్తుంటారు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న మార్గాన్ని మూసేయడంతో సందర్శకులు బస్సు దిగి బారికేడ్లపై నుంచి దాటుకుంటూ వస్తున్నారు.


కొత్త బాట సరే.. నిర్వహణ మాట?

హైకోర్టు ఎదుట మూసీలో నూతనంగా మరో నడకదారి నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పది సంవత్సరాల క్రితం కోట్ల రూపాయలతో నిర్మించిన నడకదారి, సుందరీకరణ నిర్వహణ లోపంతో అధ్వానంగా మారింది. దానికి మరమ్మతులు చేయకుండా కొత్తబాట నిర్మించడం విమర్శలకు తావిస్తోంది.


రాతికొండ.. చూసుకెళ్లాలి తప్పకుండా

తుక్కుగూడ పురపాలిక పరిధిలోని హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి మామాడిపల్లి, శంషాబాద్‌కు దూరం తగ్గించేందుకు రూ.20 కోట్లతో నిర్మిస్తున్న రహదారి ఇది. గుట్టలను తొలిచి ఈ మార్గం నిర్మించగా ఇటీవల కురిసిన వర్షాలకు రెండు చోట్ల బండరాళ్లు పడ్డాయి. పూర్తి స్థాయిలో రహదారి నిర్మించాక వాహనాలను అనుమతిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.


వాహన విస్ఫోటం

సాయంత్రం కాగానే.. నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది.   బుధవారం సాయంత్రం 6గంటలకు పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి రెయిన్‌బో హాస్పిటల్‌ వరకు ట్రాఫిక్‌ జాం ఏర్పడటంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని