logo
Published : 02/12/2021 01:58 IST

పాలిథిన్‌ నిషేధం.. కఠిన నిబంధనలే మార్గం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ

పండ్ల విక్రయదారునికి ప్లాస్టిక్‌ సంచులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన పాలిథిన్‌ (ప్లాస్టిక్‌) వినియోగం జిల్లాలోనూ అదుపులోకి రావడంలేదు. దీనికి పటిష్ఠమైన నిబంధనలు అమలు చేయడమే మార్గమని అధికారులు, ప్రజా ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామాల విషయం ఎలా ఉన్నా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉక్కుపాదం మోపేందుకు పురపాలక సంఘాల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పురపాలక సంఘాలున్నాయి. వీటిలో అయిదు సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్‌ను నిషేధించారు. గత అక్టోబర్‌ నుంచి కట్టుదిట్టంగా అమలు చేయాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆచరణలోకి రావడంలేదు. దీంతో ఎక్కడపట్టినా ప్లాస్టిక్‌ సంచులు దర్శనమిస్తున్నాయి. పుర అధికారులు మళ్లీ కార్యాచరణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం..

మారిన నిబంధనలు: గతంలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను వాడొద్దని నిబంధనలు ఉండేవి. దానిని సవరించి తర్వాత 50 మైక్రాన్లను పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక శాఖ ఆదేశాల ప్రకారం దానిని 75 మైక్రాన్ల వరకు పెంచారు. అంతకంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులు, పాలిథిన్‌ సంచులను వాడటం ఇక నేరంగా పరిగణిస్తున్నారు.  
అక్టోబర్‌ నుంచి కట్టుదిట్టం
గత ఆక్టోబర్‌ 20వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ వినియోగంపై కట్టదిట్టం అధికం చేశారు. వికారాబాద్‌లో నెలన్నర రోజుల నుంచి దుకాణాల్లో తనిఖీలు చేసి రూ. 8 వేల జరిమానా విధించారు. ఇక నుంచి రూ.1000 తగ్గకుండా రూ.25 వేల వరకు విధిస్తామని హెచ్చరించారు.
పట్టణ టాస్క్‌ఫోర్స్‌ బృందం
పురపాలక సంఘాల్లో ప్లాస్టిక్‌ నిషేధ కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుంటారు. సభ్యులు తరచుగా పట్టణాల్లోని దుకాణాల్లో తనిఖీలు చేసి ప్లాస్టిక్‌ సంచులు విక్రయిస్తున్నారా లేదా తెలుసుకుంటారు.
రెండేళ్ల క్రితం హడావిడి
పరిగి: రెండేళ్ల క్రితం పరిగి పురపాలక సంఘం పరిధిలో అధికారులు హడావిడి చేశారు. కేవలం 20మందికి జరిమానా విధించి మిన్నకున్నారు. ప్రధానంగా సిబ్బంది కొరత ఇందుకు కారణం. రెండు రోజుల క్రితం పరిగిలో కమిషనర్‌ రంగంలోకి దిగారు.  
ప్రయోజనం నామమాత్రమే
తాండూరు టౌన్‌: తాండూరులో పర్యావరణానికి హాని కలిగించే పాథిన్‌ సంచుల క్రయవిక్రయాలు చాటు మాటున జరుగుతున్నాయి. పురపాలక సంఘం అధికారులు తరుచుగా తనిఖీలు చేపడుతున్నా ప్రయోజనం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు పాలిథిÇన్‌ కవర్లను తెర చాటుగా విక్రయిస్తున్నారు.
అవగాహన కల్పిస్తాం
ప్లాస్టిక్‌ వాడితే కలిగే ముప్పు గురించి వ్యాపారులకు స్పష్టంగా వివరించటానికి సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకు రావాలి. 

   - నాగరాజ్‌, పారిశుద్ధ్యం ఇన్‌స్పెక్టర్‌, వికారాబాద్‌

విస్తృత తనిఖీలు చేపడతాం
కొత్తగా వచ్చిన జీఓ ప్రకారం ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించేందుకు కఠినంగా అమలు చేస్తాం. ప్రత్యేకంగా టీంను తయారు చేసి విస్తృత తనిఖీలు చేపట్టనున్నాం. 

- ప్రవీణ్‌కుమార్‌, కమిషనర్‌, పరిగి

స్వయంగా పాల్గొంటున్నాను
పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కచ్చితం చేశాం. తనిఖీలలో స్వయంగా నేనుకూడా పాల్గొని దుకాణ యజమానులకు అవగాహన కల్పిస్తున్నాను. 

- శరత్‌చంద్ర, కమిషనర్‌, పురపాలక సంఘం, వికారాబాద్‌
 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని