logo
Published : 02/12/2021 06:54 IST

రోడ్ల దుస్థితిపై పొర్లు దండాలు, మోకాళ్లపై నడక

తాండూరులో తెరాస కార్యకర్త వినూత్న నిరసన

కంకర తేలిన రోడ్డు మీద దొర్లుతున్న యువకుడు

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరు పట్టణంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై తెరాస కార్యకర్త వినూత్న రీతిలో నిరసనకు దిగారు. దస్తగిరి పేట్‌ గ్రామానికి చెందిన అమ్రేష్‌ పట్టణ శివారులోని ఎన్టీఆర్‌నగర్‌ నుంచి పాలశీతలీకరణ కేంద్రం దాకా కంకర తేలిన రోడ్డు మీద పొర్లు దండాలు పెడుతూ, మోకాళ్ల మీద నడుస్తూ నిరసన తెలిపారు. దీంతో వచ్చి పోయే వారు అతనికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా అమ్రేష్‌ మాట్లాడుతూ రోడ్లు దారుణంగా ఉండటంతో దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, వాహనాలు పాడైపోతున్నాయని వాపోయారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదన్నారు. ఇందుకు నిరసనగా తాను చేపట్టిన కార్యక్రమంతోనైనా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. అలాగే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ఎవరూ స్పందించడంలేదన్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా రోడ్డు మీద రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అతనిపై కేసు నమోదు చేసి ముందస్తు అరెస్టు చేసి తిరిగి వదిలి పెట్టినట్లు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని