logo
Published : 02/12/2021 03:01 IST

మల్కీజ్‌గూడెంలో పేలిన డిటోనేటర్లు

దెబ్బతిన్న ఇంటిపై కప్పు

యాచారం: వ్యవసాయ క్షేత్రం వద్ద చెత్తను తగులబెట్టిన క్రమంలో డిటోనేటర్లు పేలి స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. యాచారం సీఐ లింగయ్య, స్థానికుల కథనం ప్రకారం.. మల్కీజ్‌గూడెం మాజీ సర్పంచి మల్లేశ వ్యవసాయ క్షేత్రం వద్ద పేరుకుపోయిన చెత్తను అతని కుమారుడు రాజశేఖర్‌, బావమరిది లక్ష్మణ్‌ బుధవారం మధ్యాహ్నం తగులబెట్టారు. మంటలు వ్యాపించి కొద్ది దూరంలోని పెంటకుప్పను చేరుకోగానే పెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. అక్కడ దాచి ఉంచిన డిటోనేటర్లు పేలడమే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. పేలుళ్ల ధాటికి పక్కనే ఉన్న పశువుల కొట్టం సిమెంట్‌ రేకులు ఎగిరి గ్రామంలోని మూడు ఇళ్లపై పడ్డాయి. ఆ మూడు ఇళ్ల పైకప్పు సిమెంట రేకులు పగిలిపోయాయి. రాజశేఖర్‌, లక్ష్మణ్‌ స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ లింగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని