logo
Published : 02/12/2021 03:01 IST

18 కిలోల గంజాయి స్వాధీనం.. అక్కాతమ్ముడి రిమాండ్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న అక్కాతమ్ముడిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, ఎస్సై మజీద్‌ల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన రంజానా విశాకళాంకర్‌(42), కమల్‌సింగ్‌ విష్ణు మాల్కి(37)లు అక్కాతమ్ముడు. కొంతకాలంగా విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా చేసుకుని విక్రయిస్తున్నారు. వీరికి గంజాయి అందజేసే పలాసలో ఉండే రాణితో మాట్లాడి ఆమె ద్వారా సికింద్రాబాద్‌కు తెప్పించుకున్నారు. మంగళవారం ఆమె సికింద్రాబాద్‌కు 18 కిలోల పొడి గంజాయి తేగా.. అది తీసుకుని వారు ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేయగా వీరి లాగేజీ బ్యాగులో గంజాయిని గుర్తించారు. అక్కాతమ్ముడిని బుధవారం రిమాండుకు తరలించారు. పరారీలో ఉన్న రాణి కోసం గాలిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని