logo
Published : 02/12/2021 03:01 IST

ట్రిపుల్‌ఐటీకి రూ.5 కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ఐటీ) చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రపెన్యూర్‌షిప్‌(సీఐఈ)కి రూ.5 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిశ్రమల, అంతర్గత వాణిజ్య వ్యవహారాల ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) సీఐఈని స్టారప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకానికి ఎంపిక చేసింది. గత 13 ఏళ్లుగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు చేస్తున్న కార్యక్రమాలపై నిపుణుల సలహా మండలి సిఫార్సు మేరకు నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సీఐఈ తరఫున కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చైన్‌ సాంకేతికతలకు తోడు విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వివిధ దశలలో రూ.25 లక్షల మేర నిధులు అందిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వచ్చే మూడేళ్లలో ట్రిపుల్‌ఐటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నూతన సాంకేతికతను ఉపయోగించి 20-25 అంకుర సంస్థలకు చేయూత ఇవ్వనున్నారు. ట్రిపుల్‌ఐటీ తరఫున సమాజానికి అవసరమైన పరిశోధనలు చేపట్టి అంకుర సంస్థలుగా తీసుకుస్తున్నామని ట్రిపుల్‌ ఐటీ సంచాలకులు ప్రొ.పీజే నారాయణన్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని