logo
Published : 02/12/2021 03:01 IST

తెలంగాణకు 48 పతకాలు

జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌

శ్రీవల్లి రష్మిక

వారణాసి: జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మెరిసింది. నవంబరు 27 నుంచి 30 వరకు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ 48 పతకాలు కైవసం చేసుకుంది. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. మార్చ్‌పాస్ట్‌లో తెలంగాణ జట్టు ప్రథమ స్థానం సాధించింది. 22 రాష్ట్రాల క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొనగా.. తెలంగాణ నుంచి 95 మంది బరిలో దిగారు. మరోవైపు జాతీయ సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా కొనసాగతున్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
జమ్మూ: జాతీయ జూనియర్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిషిక అగర్వాల్‌ సత్తాచాటింది. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఈ పోటీల్లో నిషిక స్వర్ణం, రజత పతకాలు సొంతం చేసుకుంది. అన్‌ఈవెన్‌ బార్స్‌లో అగ్రస్థానం సాధించిన నిషిక.. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
రెండో సీడ్‌కు శ్రీవల్లి షాక్‌
బెంగళూరు: ఐటీఎఫ్‌ మహిళల 15000 డాలర్ల ప్రైజ్‌మనీ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ జీల్‌ దేశాయ్‌కు శ్రీవల్లి షాకిచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీవల్లి 6-3, 7-5తో జీల్‌పై నెగ్గింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని