logo
Published : 02/12/2021 03:01 IST

సత్వర న్యాయానికి సమయపాలన ముఖ్యం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, చిత్రంలో జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌,

జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి (ఎడమ నుంచి కుడికి)

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: న్యాయం చేస్తామని వేలాది మంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులు సమయపాలనను పాటించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ పేర్కొన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా నూతనంగా నియమితులైన 66 మందికి సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడీషియల్‌ అకాడమీలో బుధవారం నుంచి బేసిక్‌ కోర్సు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ కోర్సును ప్రారంభించి ప్రసంగించారు. జూనియర్‌ జడ్జీలను టార్చ్‌ బేరర్‌లుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయస్థానాల మినీస్టీరియల్‌ అధికారుల గైడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి, అకాడమీ డైరెక్టర్‌ సీహెచ్‌కే భూపతి, అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌.ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి డీవీఆర్‌ తేజోకార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని