logo
Updated : 02/12/2021 10:33 IST

Crime News: కమీషన్‌ సొమ్ము దక్కాలని అన్ననే కాల్చాడు

కారులో మృతదేహం కేసులో నిందితుడి అరెస్టు

తోట నరేందర్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కార్ఖానా, అల్వాల్‌: రియల్‌ వెంచర్లు, స్థలాల విక్రయాల్లో వచ్చే కమీషన్‌ సొమ్ము తనొక్కడికే దక్కాలన్న దురాలోచనతో వరుసకు సోదరుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. నిందితుడు తోట నరేందర్‌రెడ్డిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తిరుమలగిరి ఠాణా పరిధిలో రెండురోజుల క్రితం కారులో గుర్తించిన మృతదేహం కేసు వివరాలను, హత్యోదంతాన్ని కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఓల్డ్‌అల్వాల్‌లోని వాసవీనగర్‌ కాలనీలో ఉంటున్న తోట నరేందర్‌రెడ్డి, అల్వాల్‌లోని వాసవీనగర్‌కు చెందిన తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి వరుసకు సోదరులు. కొన్నేళ్లుగా వీరు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కమీషన్‌గా వచ్చే సొమ్మును సగం సగం పంచుకుంటున్నారు. కొద్దినెలల క్రితం భరత్‌నగర్‌లో రెండు ప్లాట్ల విషయంలో కమీషన్‌ తనకు ఎక్కువ కావాలంటూ నరేందర్‌.. విజయ్‌భాస్కర్‌ను కోరాడు. తర్వాత చూద్దామంటూ దాటవేయడంతో విజయ్‌భాస్కర్‌రెడ్డిని చంపితే ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారాల్లో ఆయన వాటా కూడా తనకు వస్తుందనే కుట్ర పన్నాడు. ఓ రిజిస్ట్రేషన్‌ ఉందని చెప్పడంతో విజయభాస్కర్‌రెడ్డి రూ.7.20లక్షలు తీసుకుని కారులో బయల్దేరాడు. మార్గమధ్యలో నరేందర్‌ ఎక్కాడు. తిరుమలగిరి ఆర్టీసీకాలనీ సమీపంలో కారు ఆపమని అడిగి విజయ్‌భాస్కర్‌రెడ్డిని తుపాకీతో కాల్చి నగదుతో పారిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుణ్ని అరెస్టు చేసి  నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని