logo
Published : 02/12/2021 03:01 IST

క్యాబ్‌ అగ్రిగేటర్ల నయా పంథా

రైడ్‌ల రద్దుతో ఇతర నగర డ్రైవర్లకు ఉపాధి

‘‘రాజేంద్రనగర్‌ నుంచి చర్లపల్లి వెళ్లేందుకు రాజశేఖర్‌ బుధవారం క్యాబ్‌ బుక్‌ చేశారు. డ్రైవర్‌ ఫోన్‌ చేసి ఎక్కడికి అని అడిగారు. గమ్యస్థానం చెప్పగానే రైడ్‌ను రద్దు చేశాడు. ఈ డ్రైవర్‌ స్థానికుడు. క్యాన్సిల్‌ కాగానే మరో క్యాబ్‌ బుక్‌ చేశాడు. ఎంతసేపు పడుతుందోననే ఆలోచిస్తుండగానే మహారాష్ట్రకు చెందిన కారు వచ్చి ఇంటి ముందు వాలిపోయింది. ఈ డ్రైవర్‌ పుణెకు చెందినవారు. అక్కడ బేరాలు లేకపోవడంతో కొవిడ్‌ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు.’’

ఈనాడు, హైదరాబాద్‌

క్యాబ్‌ అగ్రిగేటర్లు పంథా మారుస్తున్నాయి. స్థానిక క్యాబ్‌ డ్రైవర్లు ఎక్కడికంటే అక్కడికి రాలేం అని రైడ్స్‌ను ఇష్టానుసారం రద్దు చేస్తుండటంతో ముంబయి, పుణె నుంచి క్యాబ్‌లను, డ్రైవర్లను రప్పిస్తున్నాయి. కొందరు స్థానిక డ్రైవర్ల తీరుతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అగ్రిగేటర్లు వారిని దారికి తెచ్చుకునేందుకు కొవిడ్‌ తర్వాత పెద్దగా వ్యాపారం లేని ఇతర నగరాల నుంచి సిటీకి క్యాబ్‌లను రప్పిస్తున్నాయి. మరికొందరు డ్రైవర్లే హైదరాబాద్‌లో ఉపాధికి ఢోకా ఉండదని కారుతో వచ్చేస్తున్నారు. క్యాబ్‌ అగ్రిగేటర్లు సైతం వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల రైడ్‌లను గమనిస్తే ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలసొచ్చిన డ్రైవర్లు, క్యాబ్‌లు కన్పిస్తుండటం అందుకు నిదర్శనం.


ఏ రైడ్‌ను రద్దు చేయను..
- శివశంకర్‌ స్వామి, క్యాబ్‌ డ్రైవర్‌, పుణె

మా స్వస్థలం పుణె. ముంబయి, పుణెలో క్యాబ్‌ నడిపేవాడిని. కొవిడ్‌ తర్వాత అక్కడ క్యాబ్‌లకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. కొన్నాళ్లు చూశాక హైదరాబాద్‌ వచ్చా. ఇక్కడ మా బంధువులు జల్‌పల్లిలో ఉంటారు. ఉపాధికి ఇక్కడ ఢోకా ఉండదని చెబితే వచ్చా. సొంతకారు ఉంది.. ఉదయం 9 గంటలకు యాప్‌ ఆన్‌ చేస్తా. అప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తా. ఏ రైడ్‌ను రద్దు చేయను. రోజు రూ.3 వేల ఆదాయం వస్తుంది. ఆరునెలల వ్యవధిలో లక్షకుపైగానే ఆర్జించా. ముంబయితో పోలిస్తే ఇక్కడ ఖర్చులు తక్కువ. అందుకే అంత మొత్తం దాచగలిగా.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని