logo
Published : 02/12/2021 03:30 IST

గ్రేటర్‌లో 155 కొత్త ట్రాఫిక్‌ సిగ్నళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ రహదారులపై 155 ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్‌ సిగ్నళ్లు రాబోతున్నాయి. పోలీసుల సూచన మేరకు జీహెచ్‌ఎంసీ పనులు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 98 ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నళ్లనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న 221 ట్రాఫిక్‌ సిగ్నళ్లకు ఇవి అదనం. ఇకపై.. ఇవన్నీ కృత్రిమ మేథతో పని చేసే ఏటీఎస్‌సీ(యూనిఫైడ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ కంట్రోల్‌) సాంకేతికతతో పనిచేయనున్నట్లు వివరించారు. నిర్వహణను మూడేళ్లపాటు ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించామని, మెరుగైన రవాణ వ్యవస్థ సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వాహనాల రద్దీ కమాండ్‌ కంట్రోల్‌లో రికార్డవుతుందని, రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేస్తాయని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని