logo
Published : 02/12/2021 03:30 IST

నేడే ఉప్పల్‌ భగాయత్‌ భూముల ఈ-వేలం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌ భూముల్లో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపడుతున్న మూడో దశ ప్లాట్ల వేలం ప్రక్రియ గురువారం ఆన్‌లైన్‌ వేదికగా జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తొలి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 దాకా రెండో సెషన్‌లో భూముల్ని అధికారులు వేలం వేయనున్నారు. ఇక్కడ మొత్తం 44 ప్లాట్లను అభివృద్ధి చేయగా.. తొలిరోజు 33 ప్లాట్లకు వేలం ప్రక్రియ కొనసాగనుంది. మిగతావి శుక్రవారం కొనసాగనున్నాయి. గత వేలంలో అత్యధికంగా చదరపు అడుగుకు రూ.86వేలు పాడగా.. ఈ వేలంలో ఇంతకు మించిన ధరే వస్తుందన్న అంచనాల్లో అధికారులున్నారు. వివరాలకు ఈ-వేలం వెబ్‌సైట్‌: https://www.mstcecommerce.com.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని