logo
Published : 02/12/2021 03:30 IST

క్లబ్‌ పేరిట శిల్పాచౌదరి లీలలు

రూ.2 కోట్లకు పైగా ఇచ్చి మోసపోయిన హీరో మహేశ్‌బాబు సోదరి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నార్సింగి: మహిళలకు ప్రత్యేకంగా కిట్టీపార్టీలు నిర్వహిస్తూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరి మరోకోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్‌ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలున్నారని గుర్తించారు. ఆమెకు డబ్బు ఇచ్చి మోసపోయిన బాధితులు, జైల్లో ఉందని తెలుసుకొని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులను పరిశీలించి ఆయా పోలీస్‌ ఠాణాల పరిధుల్లో కేసులు నమోదు చేయనున్నట్టు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. శిల్పాచౌదరి రూ.కోట్లు వసూలు చేసిందన్న    ఆరోపణల నేపథ్యంలో, ఆమె ఎంతమంది మోసగించింది? ఎంత డబ్బు తీసుకొందని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

దివానోస్‌... వారాంతపు వినోదం

శిల్పాచౌదరి తనకు తాము టీవీ, సినీనిర్మాతగా పరిచయం చేసుకున్న సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీలను ఏర్పాటు చేస్తాను ఇష్టమైతే రావాలంటూ ఆహ్వానించేది. తొలుత కొంతమందితో మొదలైన కిట్టీపార్టీలు తర్వాత జూదశాలగా మారాయి. దీంతో మహిళల కోసమే దివానోస్‌ పేరుతో జూదశాలను ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన 90మందిని మాత్రమే సభ్యులుగా చేర్పించుకుంది. శుక్ర, శనివారాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.

కాజేసిన సొమ్ముతో ఏం చేశారు?..

రూ.కోట్లను నిందితురాలు ఏంచేసిందన్న కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు. ఆమె భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? ఏఏ ప్రాంతాల్లో వెంచర్లు వేశారన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లో సమాచారాన్ని తీసుకున్న పోలీసులు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించనున్నారు. సినీ హీరో మహేశ్‌బాబు సోదరి, కథానాయకుడు సుధీర్‌బాబు సతీమణి ప్రియదర్శిని తన నుంచి శిల్పాచౌదరి రూ.2 కోట్లకుపైగా తీసుకుని మోసం చేసిందంటూ కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని