Cyber Crime: ఎస్‌బీఐ నకిలీ కాల్‌ సెంటర్‌.. రూ.కోట్లలో మోసం!

ఎస్‌బీఐ పేరుతో నగరంలో నిర్వహిస్తున్న నకిలీ కాల్‌సెంటర్‌ గుట్టు రట్టైంది. ఎస్‌బీఐ కేవైసీ, క్రెడిట్‌ కార్డుల పేరిట దిల్లీ కేంద్రంగా

Updated : 02 Dec 2021 16:21 IST

హైదరాబాద్: ఎస్‌బీఐ పేరుతో నగరంలో నిర్వహిస్తున్న నకిలీ కాల్‌సెంటర్‌ గుట్టు రట్టైంది. ఎస్‌బీఐ కేవైసీ, క్రెడిట్‌ కార్డుల పేరిట దిల్లీ కేంద్రంగా ఓ ముఠా దీన్ని నడిపిస్తున్నట్లు సైబరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. నకిలీ కాల్‌ సెంటర్‌ ఆధారంగా ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొట్టినట్లు వారి విచారణలో తేలింది. కాల్‌సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు నిందితులకు సంబంధించిన పలు ఖాతాల్లోని నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని