logo
Published : 03/12/2021 01:15 IST

ద్విచక్రవాహనాలు ఢీ.. చిరువ్యాపారి దుర్మరణం

దుబ్బాక, సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్‌ఐ కాంతారావు తెలిపిన వివరాలు.. సిద్దిపేట అర్బన్‌ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన దూలం రాంప్రకాశ్‌గౌడ్‌ (38) భూంపల్లి చౌరస్తా వద్ద దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య సౌమ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం రాత్రి దుకాణాన్ని మూసివేసి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చిట్టాపూర్‌ శివారులో కారు బావిలో పడిన దుర్ఘటనలో వారిని తీసే ప్రయత్నంలో చనిపోయిన గజ ఈతగాడు నర్సింలు మృతి చెందడంతో ఎనగుర్తి గ్రామస్థులు అక్కడ ధర్నా నిర్వహించారు. దీంతో ధర్నాలో ఇరుక్కుపోగా ఆలస్యంగా రాంప్రకాశ్‌గౌడ్‌ ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి తన స్వగామం పద్మనాభునిపల్లి వస్తున్న వేముల రవితేజ.. రాంప్రకాశ్‌గౌడ్‌ ద్విచక్ర వాహనాలు తిమ్మాపూర్‌ గ్రామంలోని యూనియన్‌ బ్యాంకు వద్ద ఢీకొటాయి. ఈ ఘటనలో రాంప్రకాశ్‌గౌడ్‌ అక్కడిక్కడే చనిపోగా, రవితేజకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రుడిని సిద్దిపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీకి ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రమేశ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి కుమారులు లేకపోవడంతో పెద్ద కూతురు అంజలి అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కలచివేసింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని