logo
Published : 03/12/2021 01:15 IST

బాగుపడే దారేది?

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌ న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌  

తాండూరు-కొడంగల్‌ మార్గం..

తాండూరు పట్టణంలో రహదారులు అధ్వానంగా మారాయి. అడుగులోతు గుంతలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన మార్గాలతోపాటు, అంతర్గతంగా కూడా ఇదే దుస్థితి నెలకొంది. దాదాపు రూ.150 కోట్లకు పైగా నిధులు ఉన్నా, గుత్తేదారులు పూర్తి చేయడంపై శ్రద్ధ వహించడం లేదు. లేదు. గుంతల్లో నాపరాయి వ్యర్థాలు నింపుతున్నారు. తాండూరు నుంచి వికారాబాద్‌, కోట్‌పల్లి, రాస్నం, జహీరాబాద్‌, కరణ్‌కోట్‌, యాలాల, మహబూబ్‌నగర్‌-చించోళి జాతీయ రహదారి, ఇతర రహదారులు ఇదే పరిస్థితి. నాపరాయి, సుద్ద, సిమెంటు, ఎర్రమట్టి లారీలు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. దీంతో వాటి వెనుక ప్రయాణమంటే ద్విచక్రవాహనదారులకు నరకం కనిపిస్తోంది.

కోట్లు వెచ్చించినా..
సుమారు రూ.74 కోట్లు వెచ్చించిన రింగు రోడ్డు పనులు సైతం నత్తకు నడక నేర్పినట్లు కొనసాగుతున్నాయి. పట్టణంలోని రహదారులకు రూ.25 కోట్లు ఖర్చు చేసి సిమెంటు రహదారులను అభివృద్ధి చేశారు. నెలల వ్యవధిలో తాగునీటి పైపులైన్‌ కోసమని సీసీ రోడ్లను సగానికి గుంతలు తవ్వారు. వాటిల్లో కొన్ని పూడ్చినా, మరికొన్ని మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల మరో రూ.14 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం. రెండు నెలల కిందట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొడంగల్‌ నుంచి తాండూరు వరకు పాదయాత్ర చేయగా, ఇటీవల అంతారం గేటు, తాండూరు పట్టణం సమీపంలో విభిన్న రీతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
పట్టణంలో ఇలా: పట్టణ శివారులోని ఎన్టీఆర్‌నగర్‌ కాలనీ నుంచి హైదరాబాద్‌ రోడ్డు కూడలి దాకా, ఆర్టీసీ బస్‌స్టేషన్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి, ఇందిరా గాంధీ, సర్దార్‌ పటేల్‌ కూడలి, శివాజీ కూడలి మీదుగా చించోళీ రోడ్డు, కొడంగల్‌ రోడ్డు మార్గాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనాల విడి భాగాలు విరిగిపోతున్నాయని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరణ్‌కోట్‌ ప్రధాన రహదారి దుస్థితి

ప్రయాణమంటేనే భయం: సాయి
పట్టణంలో రహదారులు దారుణంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా భయమేస్తోంది. వీపరీతమైన దుమ్ము, వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాం. వాహనాలు మరమ్మతుకు గురవుతున్నాయి. రూ.కోట్లలో నిధులు తెచ్చామని ప్రతి సందర్భంలోనూ ప్రజాప్రతినిధులు చెబుతున్నా, పనులు మాత్రం జరగడం లేదు.

ఒళ్లు హూనం: మణికంఠ
రోడ్లపై ప్రయాణం అంటేనే ఒళ్లు హూనమవుతోంది. గుంతల వద్ద ఆర్టీసీ బస్సులు వేగంగా వెళితే వెనుక సీట్లలో కూర్చున్న వారు ఎగిరి పడుతున్నారు. వికారాబాద్‌ మార్గం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. నాణ్యత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మంబాపూర్‌ గ్రామం వద్ద దారి అప్పుడే గుంతలుగా మారి అవస్థలు పడుతున్నాం.

గుత్తేదారులపై ఒత్తిడి తెస్తున్నాం
లాల్‌సింగ్‌, రహదారులు, భవనాల శాఖ ఈఈ.

అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులపై ఒత్తిడి తెస్తున్నాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. పనులు నిలిచిపోవడం, విడిచిపెట్టి వెళ్లిన సందర్భాలు లేవు. నెమ్మదిగా కొనసాగుతున్నాయి. వాటిని వేగవంతం చేయాలని సూచిస్తున్నాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని