logo
Published : 03/12/2021 02:49 IST

నేడు మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం

ఈనాడు. హైదరాబాద్‌: పేదలకు బస్తీలోనే నాణ్యమైన వైద్యాన్ని అందించే బస్తీ దవాఖానాలను జీహెచ్‌ఎంసీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 226 ప్రాంతాల్లో సేవలందిస్తుండగా, మరో 32 బస్తీ దవాఖానాలను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ గురువారం ప్రకటించారు. వీటితో కలిపి గ్రేటర్‌లో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 258కి పెరగనుంది. నిర్మాణ దశలో ఉన్న మరో ఏడు ఈ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తాయని, మరో 35 ఏర్పాటునకు స్థలాలను అన్వేషిస్తున్నామన్నారు. మొత్తం 350 చేయడమే లక్ష్యమని కమిషనర్‌ పేర్కొన్నారు.  

తాజాగా ఏర్పాటు కానున్న ప్రాంతాలు
నాచారం-6 డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీ.
చిలుకానగర్‌-7లోని బీరపాడు రామాలయం సమీప సామాజిక భవనం.
హబ్సిగూడ-8లోని వికలాంగుల ఉన్నత పాఠశాల.
చవానీ-29లోని బాగ్‌-ఇ-జహ్రా సామాజిక భవనం.
రెయిన్‌బజార్‌-31 ముర్తుజానగర్‌ బాలికల ప్రాథమిక పాఠశాల.
లలితాబాగ్‌-36లోని ఫతేషానగర్‌ కొనైనా మసీదు.
రియాసత్‌నగర్‌-40లోని సామాజిక భవనం.
కంచన్‌బాగ్‌-41లోని క్లాసిక్‌ గార్డెన్‌ వద్ద మజీద్‌-ఇ-ఒమర్‌ ఫరూఖి సి బ్లాక్‌.
నవాబ్‌సాహెబ్‌ కుంట-47లో అచ్చిరెడ్డినగర్‌ సామాజిక భవనం.
గోషామహల్‌-51.. దూల్‌పేట చంద్రకిరణ్‌ బస్తీ సామాజిక భవనం.
పురానాపూల్‌-52లోని జలాల్‌ కుంచ సామాజిక భవనం.
రామ్‌నస్‌పుర-55 చిరాక్‌గల్లీ సామాజిక భవనం.
మెట్టుగూడ-144. దూద్‌ బావి.
టోలిచౌకి-68లోని ఒవైసీ సామాజిక భవనం.
మల్లేపల్లి-76 జాకీర్‌ హుస్సేన్‌ సామాజిక భవనం.
గోల్నాక-82లోని కమగారినగర్‌ సామాజిక భవనం.
ఖైరతాబాద్‌-91లోని మహాభారతనగర్‌ సామాజిక భవనం.
షేక్‌పేట్‌-94లోని రాజీవ్‌గాంధీ నగర్‌ సామాజిక భవనం.
జూబ్లీహిల్స్‌-95లోని గురుబ్రహ్మనగర్‌ సామాజిక భవనం.
యూసుఫ్‌గూడ-96లో  యూసుఫ్‌గూడ సామాజిక భవనం.
శేరిలింగంపల్లి-106లోని నెహ్రూ నగర్‌ సామాజిక భవనం.
చందానగర్‌-110లోని పాపిరెడ్డి సామాజిక భవనం.
పాత బోయిన్‌పల్లి-119లోని కాలనీ సామాజిక భవనం.
ఫిరోజ్‌గూడలోని బాలానగర్‌-120 వార్డు కార్యాలయం.
హైదర్‌నగర్‌-123లోని వార్డు కార్యాలయం.
చింతల్‌-128లో సామాజిక భవనం.
సుభాష్‌నగర్‌-130లోని అపురూపకాలనీ సామాజిక భవనం.
మచ్చబొల్లారం-133లోని హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర.
వెంకటాపురం-135లోని గోకుల్‌నగర్‌ పార్కు.
నేరెడ్‌మెట్‌-136లోని చెక్‌పోస్ట్‌ సామాజిక భవనం.
గౌతమ్‌నగర్‌-141లోని సామాజిక భవనం.
బన్సీలాల్‌పేట-147లోని హమాలీ బస్తీ సామాజిక భవనం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని