logo
Published : 03/12/2021 02:47 IST

భవనంపై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య

నిజాంపేట, న్యూస్‌టుడే: పదమూడేళ్ల బాలుడు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమారుడు(13) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గారాభంగా పెంచారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో బాలుడు వారు నివాసముండే అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లి ఆరో అంతస్తులో నీటి ట్యాంకుపైకి ఎక్కి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావడం గమనించిన స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. బాచుపల్లి ఎస్సై సాయినాథ్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని