అక్రమంగా ఉంటున్న ఏడుగురు విదేశీయుల గుర్తింపు
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉన్న ఏడుగురు విదేశీయులను గుర్తించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని పీఎన్టీ కాలనీలో డీసీపీ నేతృత్వంలో పోలీసులు నిర్భంద తనిఖీ నిర్వహించారు. వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి వివరాలు సేకరించారు. 25మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు వీసా గడువు ముగిసినా ఇక్కడే నివసిస్తున్నట్లు గుర్తించారు. కాంగో, నైజీరియా, ఉగాండ, సుడాన్ దేశీయులని డీసీపీ తెలిపారు. ఎఫ్ఆర్ఆర్వో(ఫారనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)కు అప్పజెప్పినట్లు సీఐ కనకయ్య తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.