logo
Published : 03/12/2021 02:47 IST

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: మానసిక ఒత్తిడి భరించలేక ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్‌బీ ఎస్సై నర్సింహులు వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిధిలో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు(17) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థి. ఇటీవల చదువు విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. గురువారం ఉదయం అందరూ బయటకు వెళ్లగా ఇతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఒంటిగంట సమయంలో పనిమనిషి వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. మెట్ల దగ్గర రెయిలింగ్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని