logo
Published : 04/12/2021 01:13 IST

దివ్యాంగుల సంక్షేమంలో మనమే ముందున్నాం

మంత్రి సబితారెడ్డి

రాజీవ్‌ గృహకల్పలో సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.సబితారెడ్డి అన్నారు. వీరికి 5 శాతం సంక్షేమ పథకాలను  వర్తింపజేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక డీపీఆర్‌సీ భవనంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 70 శాతం అంగవైకల్యం ఉంటేనే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారని, తెలంగాణలో మాత్రం 45 శాతం ఉన్నవారికీ అందుతున్నాయన్నారు. సామాజిక సమైక్యతను పెంచేందుకు దివ్యాంగులను పెళ్లి చేసుకొనే వారికి రూ.50 వేల ప్రోత్సాహకం  ఇస్తున్నామని చెప్పారు.  

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి  : కొవిడ్‌ను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడానికి వంద శాతం వ్యాక్సినేషన్‌  పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అంబేడ్కర్‌ భవన్‌లో  ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇద్దరూ సమన్వయంతో వ్యవహరించి ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకొనేలా  చైతన్యపర్చాలన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఎవరూ అనవసర భయాందోళనలకు గురికావొద్దని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో సురక్షితంగా ఉండొచ్చన్నారు. జిల్లాలో 83 శాతానికి పైగా అర్హులు మొదటిడోసు టీకా వేయించుకున్నారని మంత్రి వివరించారు.

ఆరుతడి పంటలు వేయండి..: రైతులు వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.  విపణిలో డిమాండ్‌ ఉన్న పంటలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో జిల్లాలో 40 వేల మెట్రిక్‌ టన్నుల లోపు దిగుబడులు వచ్చే ధాన్యం ఇప్పుడు 2 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా వస్తోందన్నారు. బాల రక్షక్‌ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాజీవ్‌ గృహకల్పలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌,  కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, గ్రంథాలయ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు మురళీకృష్ణ, మనోహర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, పురపాలక  అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న మంత్రి..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని మంత్రి  తన రక్షణ(ఎస్కార్టు) వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రానికి వస్తుండగా, దంతవైద్య కళాశాల సమీపంలో గుర్తు తెలియని కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన మంత్రి తన కారును ఆపి వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందేలా చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని