logo
Published : 04/12/2021 01:13 IST

మా గ్రామాలకు బస్సులు నడపండి..


రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు..

పరిగి గ్రామీణ: మా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సయ్యద్‌పల్లి, రాపోల్‌ గ్రామాల విద్యార్థులు శుక్రవారం షాద్‌నగర్‌ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రెండువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు సమాచారం అందటంలో ఎస్సై విఠల్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. బస్సు లేక మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని, దీంతో అలసిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎస్సై చరవాణి ద్వారా ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సమస్యను వివరించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని డిపో మేనేజర్‌ హామీ ఇవ్వడంతో విద్యార్థులు వాహనాలకు దారిని వదిలారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని