logo
Published : 04/12/2021 01:13 IST

ప్రజా చైతన్యం.. సమస్యల పరిష్కారం

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు

వికారాబాద్‌లో 2కె పరుగులో పాల్గొన్న యువకులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యువత అభ్యున్నతికి తోడ్పాటునందిస్తూ.. వారిలో సేవాతత్పరతను పెంపొందించేందుకు నెహ్రూ యువ కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. వికారాబాద్‌ జిల్లాలో 220 వరకు యువజన సంఘాలున్నాయి. ఇందులో  సభ్యులుగా చేరిన వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రం నుంచే  పర్యవేక్షణ కొనసాగుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గాంధీ, వివేకానంద జయంతి, యోగా, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి కార్యక్రమాలనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన స్వచ్ఛ భారత్‌, 2కె,  5కె రన్‌, క్విట్‌ ఇండియా వంటివి చేపడుతున్నారు. క్రీడల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇటీవల జిల్లాలో వాలీబాల్‌, క్రికెట్‌, పరుగు, కబడ్డీ, బాస్కెట్‌ బాల్‌ పోటీలను నిర్వహించారు.

బస్‌స్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత: స్వచ్ఛతలో భాగంగా బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తున్నారు. ఇదే కాకుండా ఉద్యానవనాల్లో చెత్తను తొలగించారు. కాల్వల్లో మురుగు తొలగించి, గుంతలు పడిన రోడ్లకు మరమ్మతు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించి చైతన్యం తీసుకొస్తున్నారు. సెప్టెంబరులో వికారాబాద్‌లో 2కె రన్‌, ఆగస్టులో పరిగిలో క్రీడా పోటీలను నిర్వహించారు. తాండూరులో 60 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఇటీవల ధ్రువీకరణ పత్రాలను అందించారు.

జల్‌శక్తి అభియాన్‌పై..: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌శక్తి అభియాన్‌పై గ్రామాల్లో యువజన సంఘాల సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయవద్దని సూచిస్తున్నారు. ప్రతి గ్రామంలో యువజన బృందం పర్యటించి, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై వివరిస్తున్నారు. పొలాల వద్ద నీరు నిల్వ ఉండే విధంగా చిన్న గుంతలను ఏర్పాటు చేసుకోవాలని అన్నదాతలకు వాటి ప్రయోజనం గురించి తెలుపుతున్నారు. జిల్లాలో కార్యక్రమాలను విస్తరిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా యువజన అధికారి ఐజయ్య అన్నారు. ఇతర వివరాల కోసం చరవాణి నంబరు 77601 87737ను సంప్రదించవచ్చన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని