logo
Published : 04/12/2021 02:05 IST

చిత్ర వార్తలు

ఆందోళన మొదలు.. ఆంక్షలు అమలు

దేశంలో కరోనా ఒమిక్రాన్‌ రకం కేసులు నమోదవడంతో నగరంలో ఆంక్షలు అమలు ప్రారంభమైంది. వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఆసుపత్రులకు వచ్చే వారికి మాస్కు తప్పనిసరి చేశారు. సరోజినీదేవి ఆసుపత్రిలోకి మాస్కు ఉన్న వారినే అనుమతించారు.


యూకే ఈ ఏడాది నవంబరు 20న ఐదు పౌండ్ల నాణెంపై ఓవైపు గాంధీ చెప్పిన ‘నా జీవితమే ఓ సందేశం’ మాటను ముద్రించింది. మరో వైపు భారత జాతీయ పుష్పం కమలాన్ని ముద్రించింది. ఈ నాణేన్ని నగరానికి చెందిన భారతీయ రైల్వేలో సమాచార విభాగం రీజినల్‌ జీఎం పాడి రవి దక్కించుకున్నారు. దేశంలో మొదటగా ఈ నాణేన్ని ఆయనే దక్కించుకున్నారు.  

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


షేక్‌పేటలో బస్తీ దవాఖానా ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌ చిత్రంలో ఎమ్మెల్యే గోపీనాథ్‌


చార్మినార్‌ జలాల్‌కుంచలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌


పాతబోయిన్‌పల్లిలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు పక్కన ఎమ్మెల్యే ఎం.కృష్ణారావు


ధూల్‌పేటలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రారంభిస్తున్న మంత్రి తలసాని


చింతల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న మంత్రి మల్లారెడ్డి పక్కన ఎమ్మెల్యే వివేకానంద్‌


తవ్వాల్సిన పనిలేకుండా..

ర్ణాటక హసన్‌ నుంచి నగరానికి వస్తున్న గ్యాస్‌ పైపులైన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల తవ్వాల్సిన పనిలేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాలను ఉపయోగించి భూమిలోకి పైపులు వేస్తున్నారు. నగర శివారులో బాచారం వద్ద దృశ్యం ఇది.


ఇళ్లలోకి మురుగు.. కళ్లలో నీరు

నాగోలు బండ్లగూడ చెరువు పరిసరాల్లో పరిస్థితి ఇది. లోతట్టులో ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో ఇళ్లన్నీ నీళ్లతో నిండాయి. దీనికి తోడు మురుగు సైతం చెరువులోకి చేరుతుండటంతో స్థానికులు ఆందోళన చెంది ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా పోస్తున్నారు.


ప్రకృతి వనంలో భోజనాలు

కార్తిక మాసం చివరి రోజు నగర శివారులోని కీసరగుట్ట క్షేత్రానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. పచ్చని చెట్లమధ్య వన భోజనాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. గుట్టలపై ఉన్న శివలింగాల వద్ద పూజలు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని