logo
Published : 04/12/2021 02:05 IST

అద్భుత పర్యాటక ప్రదేశాల నిలయం తెలంగాణ


ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటకానికి ఎంతో ప్రాధాన్యమిస్తోందని.. రాష్ట్రంలో అనేక అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వీటిని సందర్శించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌మార్ట్‌ శుక్రవారం ప్రారంభమైంది. 5వ తేదీ వరకు మూడురోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో తెలంగాణతో పాటు గోవా, జమ్ముకశ్మీర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌ నికోబార్‌దీవుల టూరిజం అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల స్టాళ్లను పరిశీలించిన అనంతరం మంత్రి, ఛైర్మన్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటకఅభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, అధికారులు మహేశ్‌, ఓంప్రకాశ్‌, శశిధర్‌, అంజిరెడ్డి, వివిధ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని