logo
Published : 04/12/2021 02:05 IST

కొల్లగొట్టింది ఏం చేశారు?


సాయికుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన సాయికుమార్‌, అతడి సహచరులు నేరాల్లో ఆరితేరారు. ప్రభుత్వ సంస్థలకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పన్నెండేళ్ల కిందట వీరు ఒక ముఠాగా ఏర్పడి అప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నారు. తెలుగు అకాడమీ అధికారులు వివిధ బ్యాంకుల్లో మదుపు చేసిన నగదు నిల్వల నుంచి రూ.100 కోట్లు కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని సీసీఎస్‌ పోలీసులు తాజాగా తెలుసుకొన్నారు. ప్రధాన నిందితుడు సాయికుమార్‌ బృందానికి  తెలుగు అకాడమీలో ఏవోగా పనిచేస్తున్న రమేష్‌ సహకరించాడని సాక్ష్యాధారాలను సేకరించారు. మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు సాయికుమార్‌, సోమశేఖర్‌, రమేష్‌, డాక్టర్‌ వెంకట్‌, సత్యనారాయణ, వెంకటరమణను శుక్రవారం కస్టడీకి తీసుకొన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ నుంచి నిందితులు కాజేసిన రూ.64.5 కోట్లు ఏం చేశారన్న అంశాలపైనే వీరిని ప్రశ్నిస్తున్నామని ఏసీపీ మనోజ్‌కుమార్‌ తెలిపారు. పన్నెండేళ్లలో సాయికుమార్‌ బృందం రూ.200 కోట్లు స్వాహా చేశారని పోలీసులు ఆధారాలు సేకరించారు.  ప్రధాన నిందితుడు సాయికుమార్‌ ఆర్థిక వ్యవహారాలపై సీసీఎస్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో తన వాటాగా తీసుకున్న రూ.20 కోట్ల నగదును ఏం చేసుంటాడన్న అంశంపై పరిశోధిస్తున్నారు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితురాలు ప్రమీలారాణిని అరెస్టు చేశామని, తమ కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులను శనివారం సాయంత్రం వరకూ విచారించనున్నామని ఏసీపీ మనోజ్‌కుమార్‌ వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని