logo
Published : 04/12/2021 02:05 IST

బోర్డుందా.. పన్ను బాదుడే!

సంస్థలు, దుకాణాలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో పన్ను వసూళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. ఆదాయం కోసం అధికారులు నోటీసుల అస్త్రాన్ని వ్యాపారులపైకి వదులుతున్నారు. ఇటీవల అగ్నిమాపక చర్యల్లేవంటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని దుకాణాలకు నోటీసులిచ్చి రూ.10వేల చొప్పున వసూలు చేశారు. ప్రక్రియ ఇంకా నడుస్తోంది. అంతలోనే ప్రకటనల విభాగం మరో అడుగు ముందుకేసి.. బోర్డులకు పన్ను కట్టాలని నోటీసులిస్తోంది. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, దుకాణాలు, విద్యా సంస్థల, ఇతరత్రా సముదాయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుని.. డబ్బు చెల్లించి బోర్డులకు అనుమతి తీసుకోవాలని నేరుగా చలాన్లు ఇస్తున్నారు. రూ.200కోట్ల ఆదాయమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది.

కనీసం రూ.10వేలు కట్టాల్సిందే.. జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం, ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోయింది. మరోవైపు భారీ అభివృద్ధి పనులతో నిధుల సమస్య తలెత్తింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రకటనల విభాగం ఏప్రిల్‌ 2020లో ప్రభుత్వం ఇచ్చిన జీవోను అవకాశంగా తీసుకుంది. నగరంలోని ప్రాంతాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రకటన బోర్డులకు రుసుము వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. 50 చ.అడుగుకు మించకుండా, ఇతర పరిమితుల మేరకు ప్రకటన బోర్డులుండాలి. ప్రకటనల విభాగం అన్ని ప్రాంతాల్లో వ్యాపారులకు నోటీసులు, చలాన్లు ఇస్తోంది. మెట్రో మార్గమున్న రోడ్డుపై బంజారాహిల్స్‌లో ఒక చదరపు అడుగుకు రూ.1875 రుసుము చెల్లించాలి. శివారు ప్రాంతాల్లో కనిష్ఠంగా చదరపు అడుగుకు రూ.1100 రుసుము ఉంది. ఎలా తీసుకున్నా.. చిన్నపాటి బోర్డుకైనా కనీసం రూ.10వేల రుసుము చెల్లించాల్సి వస్తుంది. కొవిడ్‌ వ్యాప్తి, ఇరతత్రా కారణాలతో ఆస్తిపన్ను చెల్లించేందుకే అవస్థలు పడుతున్నామని, ఇప్పుడు అగ్నిమాపక చర్యల్లేవని రూ.10వేలు, బోర్డు పెట్టుకున్నందుకు రూ.10వేలు కట్టాలని నోటీసులు ఇస్తుండటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని