logo
Published : 04/12/2021 02:05 IST

గురువులు, తల్లిదండ్రులకు సెల్యూట్‌

దివ్యాంగులను చూసి గవర్నర్‌ తమిళిసై భావోద్వేగం

చిన్నారిని పలకరిస్తూ గవర్నర్‌ ఆనందం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఎంతో ఓర్పు, సహనం, నిబద్ధత, అంకితభావంతో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారత సంస్థ(ఎన్‌ఐఈపీఐడీ) ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు వారి తల్లిదండ్రులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. సంస్థలోని పరిస్థితులు తనను ఎంతగానో కదిలించాయంటూ గవర్నర్‌ కొంత భావోద్వేగానికి గురయ్యారు. న్యూబోయిన్‌పల్లి మనోవికాస్‌నగర్‌లోని ఎన్‌ఐఈపీఐడీలో శుక్రవారం ‘అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం’ నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ తొలుత సంస్థ ఆవరణలోని ‘ఆక్యుపేషనల్‌ థెరపీ’, ‘క్రాస్‌ డిసేబిలిటీ-ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌’లను సందర్శించారు. ఆయా విభాగాలలో శిక్షణ పొందుతున్న చిన్నారులను ప్రేమతో ఎత్తుకొని, లాలిస్తూ చాక్లెట్లు అందజేయడం విశేషం. అనంతరం ఎన్‌ఐఈపీఐడీతోపాటు జాతీయ బధిరులు, అంధులు, దివ్యాంగుల సంస్థల స్టాళ్లను సందర్శించారు. సంస్థలో సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ పొందుతున్న దివ్యాంగులు నృత్యాలు చేసి సందడి చేశారు. శ్రీపాద్‌ అనే దివ్యాంగుడు కీబోర్డు, హార్మొనీ, తబలా వాయించి ప్రత్యేకతను చాటుకున్నాడు. ఒక సందర్భంలో సమయం తక్కువగా ఉన్నందునా పలు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా.. గవర్నర్‌ స్పందించి కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగిస్తూ.. స్వతహాగా గైనకాలజిస్టునైనా తాను దివ్యాంగులకు సేవలందించాలనే గర్భంలో ఉన్న శిశువు పరిస్థితులు తెలుసుకోవడానికి సోనాలజీ చదవడంతోపాటు ఫీటల్‌ థెరపీ పూర్తి చేసి సేవలందించానని తెలిపారు. ఎన్‌ఐఈపీఐడీకి రాజ్‌భవన్‌ తరఫున పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన శ్రీహర్ష, ఆకాశ్‌, తపస్‌, రోషన్‌, శివ, శ్రీకాంత్‌లకు అవార్డులతోపాటు నగదు బహుమతులు అందజేశారు. పలువురికి వినికిడి యంత్రం, కృత్రిమ అవయవాలను అందజేశారు. సంస్థ డైరెక్టర్‌ బీవీ రాంకుమార్‌, సైకాలజీ విభాగాధిపతి దశరథ్‌చౌదరి, ప్రముఖ సైకియాట్రిస్టు శ్రావణ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ గణేశ్‌ షేరేగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని