logo
Published : 04/12/2021 02:05 IST

అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు, కుమారుడు దుర్మరణం
  

శేఖర్‌రెడ్డి                        ధనమ్మ                      రఘుమారెడ్డి

లింగాలఘనపురం(రఘునాథపల్లి), న్యూస్‌టుడే, చందానగర్‌, న్యూస్‌టుడే: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని పాపిరెడ్డికాలనీకి చెందిన జిన్న శేఖర్‌రెడ్డి(65) బావ సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన సంకెపల్లి నర్సిరెడ్డి గురువారం మృతి చెందాడు. అంత్యక్రియలకు శుక్రవారం తెల్లవారుజామున శేఖర్‌రెడ్డి ఆయన భార్య ధనమ్మ(60), కుమారుడు రఘుమారెడ్డి(27)తో కలిసి కారులో బయలుదేరారు. జనగామ-సూర్యాపేట రహదారి మీదుగా వెళ్తుండగా బంజర గ్రామం క్రాస్‌ రోడ్డు వద్ద కారు టైరు పేలింది. అదుపుతప్పి ఎదురుగా పశువుల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయి శేఖర్‌రెడ్డి, ధనమ్మ, రఘుమారెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పశువుల వాహనం నల్గొండ జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడేనికి చెందినదిగా గుర్తించారు. వాహనం డ్రైవర్‌ నరేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఐదు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ రఘుచందర్‌ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేశారు.

అత్తాకోడళ్ల పరిస్థితి దయనీయం
శేఖర్‌రెడ్డికి ధనమ్మకు సంతానం కలగకపోవడంతో రమణమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కొన్నాళ్లకు ధనమ్మకు రఘుమారెడ్డి జన్మించారు. రెండో భార్య కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. రఘుమారెడ్డికి దివ్యతో ఏడాది క్రితమే వివాహమైంది. బుధవారమే వారి వివాహ వార్షికోత్సవం జరిపారు. శేఖర్‌రెడ్డి, రఘుమారెడ్డి మృతి చెందడంతో రమణమ్మ, దివ్య ఒంటరివారయ్యారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని